ఏంటీ చండాలం : ఫోన్ పే, గూగుల్ పే తరహాలో.. కిస్ పే షాపింగ్

ఏంటీ చండాలం : ఫోన్ పే, గూగుల్ పే తరహాలో.. కిస్ పే షాపింగ్

ఓరి దుర్మార్గుడా.. ఎంత నీచానికి ఒడిగట్టావురా.. అమ్మాయిలకు ఆశ చూపించి వీడు చేస్తున్న దగుల్బాచీ పనులపై నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. వస్తువులు కొనుగోలు చేయటానికి వచ్చిన ఓ అమ్మాయిల దగ్గర ముద్దు ఇస్తే చాలు.. డబ్బులు తీసుకోను అంటూ ఆఫర్ ప్రకటించి.. ఆడ పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాడు ఈ షాపు వాడు. గూగుల్ పే, ఫోన్ పే తరహాలో.. కిస్ పే అంటూ.. ఒక్క ముద్దుకు ఫ్రీ సరుకులు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ షాపు వాడిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి నెటిజన్ల నుంచి.

ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది.. ఏ రాష్ట్రం.. ఏ ప్రాంతం అనే విషయాలపై ఇంకా స్పష్టమైన వివరాలు రాకపోయినా.. వీడియోపై ఉన్న అక్షరాలను బట్టి ఇది బెంగాల్ లేదాకేరళ అయ్యి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓ 15 ఏళ్ల వయస్సు ఉంటే ఓ చిన్నారి.. స్కూల్ యూనిఫాంలో ఉంటుంది. స్కూల్ బ్యాగ్ తగిలించుకుని ఉంటుంది. ఓ షాపు దగ్గరకు వెళుతుంది. షాపు ఓనర్.. ఆ అమ్మాయికి బహిరంగంగానూ ముద్దు ఇవ్వటం వీడియోలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోకు ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు.. ఫోన్ పే, గూగుల్ పే తరహాలో కిస్ పే వచ్చింది.. ముద్దు ఇస్తే సరుకు ఫ్రీ అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియో ఒరిజినల్ సోర్స్ మాత్రం డిలీట్ కావటం కలకలం రేపుతోంది. 

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావటంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి షాపు ఓనర్లను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ తోపాటు.. ఆ షాపును గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. ఇన్ స్ట్రాలో వైరల్ అయిన ఈ వీడియో ఆధారంగా సైబర్ క్రైం పోలీసులు విచారణ చేస్తున్నారు. మొదటగా ఎవరు ఈ వీడియోను పోస్ట్ చేశారు అనేది గుర్తించటానికి ప్రయత్నిస్తున్నారు. అతన్ని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. వీడియో చూస్తే మాత్రం ఇది ఇండియాలోనే జరిగిందని చెబుతున్నారు నెటిజన్లు. మొత్తానికి ఇలాంటి తరహా షాపింగ్ అనేది చాలా ఘోరం అని.. ఇలాంటి వాటిని మొదట్లోనే కఠినంగా అరికట్టాలని.. ఇలాంటి వ్యాపారులపై తీవ్ర చర్యలు తీసుకోవాలనేది నెటిజన్ల డిమాండ్... చూడాలి ఆ నీచుడు దొరుకుతాడో లేదో..