వామ్మో... మరోసారి డైరీమిల్క్​ చాక్లెట్లో పురుగులు...​ తినేముందు డాక్టర్​ అప్పాయింట్​ మెంట్​ తీసుకోండి..

వామ్మో... మరోసారి డైరీమిల్క్​ చాక్లెట్లో పురుగులు...​ తినేముందు డాక్టర్​ అప్పాయింట్​ మెంట్​ తీసుకోండి..

మరోసారి క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ లో పురుగులు దర్శనమిచ్చాయి. ఎక్స్‌పైరీ డేట్ ముగియకముందే అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో కొన్న చాక్లెట్ కుళ్లిపోయిందంటూ ఓ నెటిజన్ ఫొటోలు పోస్ట్ చేశారు. దీనిపై ఫుడ్ సెఫ్టీ అధికారులనుంచి ఇంకా ఎలాంటి స్పందన లేకపోవడం విశేషం. పోస్ట్ వైరల్ అవుతుంది.

పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవలే హైదరాబాద్ అమీర్ మెట్రో స్టేషన్ లో ఓ వ్యక్తి ఈ చాక్లెట్ కొని కవర్ తెరవగానే పురుగులు కనిపించాయి. దీంతో వెంటనే జీహెచ్ఎంసీకి అధికారులకు ఫిర్యాదు చేయగా.. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. చాక్లెట్ల నమూనాలను ల్యాబ్‌కు పంపించి పరీక్షించగా ఇవి తింటే ఆరోగ్యానికి హానీకరమని హెచ్చరించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా మరోసారి ఇదే చాక్లెట్ లో పురుగులు దర్శనమివ్వడం హాట్ టాపిక్ గా మారింది. 

మంచిని ఆశిద్దాం.. తియ్యని వేడుక చేసుకుందాం ఇదీ క్యాడ్ బరీ(Cadbury) డైరీమిల్క్(Dairy Milk) చాక్లెట్ స్లోగన్. పిల్లల నుంచి పెద్దల వరకు దీని రుచికి దాసోహం అవ్వని వారు ఉండరు. నోట్లోవేసుకోగానే వెన్నలా కరిగిపోయే ఈ చాక్లెట్ చుట్టూ  తీవ్ర వివాదం నడుస్తోంది. చాక్లెట్ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా వాటిని అందరూ తింటుంటారు. ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ లు కూడా ధీర్ఘకాలంలో అనారోగ్యానికి గురి చేస్తాయని నిపుణులు హెచ్చరించిన వాటిని మనం వదలం. అయితే ఈ చాక్లెట్ లు ధీర్ఘకాలంలోనే కాదు.. చూసుకోకుండా తింటే ఇప్పుడే అనారోగ్యానికి గురయ్యే అవకాశం లేకపోలేదు. వాటిని తయారు చేసే ప్రాంతంలోనో, లేదా ప్యాకింగ్ చేసే ప్రాంతంలోనో నిర్లక్ష్యంగా వ్యవహించడమే దానికి కారణం. 

చాక్లెట్ లో ఫంగస్..

ఈ మేరకు శుక్రవారం ‘హైదరాబాదీ పిల్లా’ అనే పేరుతో ఎక్స్ ఖాతా కలిగివున్న ఓ నెటిజన్ అమీర్ పేట మెట్రో స్టేషన్ లో డైరీ మిల్క్ చాక్లెట్‌ను కోనుగోలు చేశారు. తీరా తిందామని కవర్ తెరిచి చూస్తే అందులో ఫంగస్ కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన యువతి.. వెంటనే దానిని నెట్టింట పోస్ట్ చేసింది. ‘డైరీ మిల్క్ చాక్లెట్ తయారీ తేదీ జనవరి 2024 ఉంది. 12 నెలల వరకు దాని ఎక్స్‌పైరీ డేట్ ఉంది. కానీ చాక్లెట్ తెరిచి చూస్తే ఇలా ఉంది. దీనిని చూడండి’ అంటూ చాక్లెట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ట్వీట్ వైరల్‌ కాగా.. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులకు పలువురు ఫిర్యాదు చేశారు. ఇంత దారుణం జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారని, దీనిపై కఠినమైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేని పశ్నిస్తున్నారు. ఫొటోలు వైరల్ అవుతున్నాయి.