కాకా కుటుంబం ప్రజా సేవకే అంకితం : వివేక్ వెంకటస్వామి

కాకా కుటుంబం ప్రజా సేవకే అంకితం :  వివేక్ వెంకటస్వామి

కాకా కుటుంబం ప్రజా సేవకే అంకితమన్నారు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూర్ మండలం సుందరసాలలో జరిగిన కార్నర్ మీటింగ్ లో వివేక్ పాల్గొన్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర సాధనలో కాకా కుటుంబం కీలక పాత్ర పోషించిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే 5 గ్యారంటీలను అమలు చేసిందన్నారు. ఇక సుందరసాల గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు వివేక్.