మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద భారీ కొండచిలువ

మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద  భారీ కొండచిలువ
  •     పట్టుకోవడానికి స్నేక్​ క్యాచర్​ప్రయత్నం
  •     పొదల్లోకి పారిపోయి చిక్కలే
  •     12 అడుగులు ఉందన్న కార్మికులు  

అంబర్ పేట్, వెలుగు : మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద సోమవారం అర్ధరాత్రి భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో బ్రిడ్జి పనులు చేస్తున్న కార్మికులు పనులు ముగించుకొని పక్కనే ఉన్న తమ గుడిసెల వద్దకు వెళ్తుండగా  12 అడుగుల పొడవు ఉన్న భారీ కొండచిలువ కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు స్నేక్ క్యాచర్స్ ను తీసుకురాగా, ఆయన పట్టుకోవడం ప్రయత్నించాడు. అయితే, అది మెల్లగా చెట్ల పొదల్లోకి జారుకుంది. దీంతో కార్మికులంతా రాత్రంతా భయంతో జాగారం చేశారు. త్వరలోనే కొండచిలువను పట్టుకుంటామని, భయపడాల్సిన పనిలేదని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రకటించారు.