అబుదాబిలో రణ్ వీర్ సింగ్ను గుర్తు పట్టని జర్నలిస్టు

అబుదాబిలో రణ్ వీర్ సింగ్ను గుర్తు పట్టని జర్నలిస్టు

బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్కు అబుదాబిలో వింత అనుభవం ఎదురైంది. ఫార్ములా వన్ రేసుకు హాజరైన రణ్ వీర్ సింగ్ను ఓ జర్నలిస్టు గుర్తు పట్టలేకపోయాడు. పైగా నువ్వెవరూ అంటూ ప్రశ్నించాడు. దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. 


 
మీరెవరు..?
అబుదాబిలో ఫార్ములా వన్ గ్రాండ్ ప్రిక్స్ కార్ల రేస్ జరిగింది. పోటీలకు రణ్ వీర్ సింగ్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్గా హాజరయ్యాడు. అయితే రణ్ వీర్ సింగ్...తనదైన శైలిలో దుస్తులు, కళ్లకు కామిక్ అద్దాలు ధరించాడు. అయితే అబుదాబి ఫార్ములా వన్ రేసుకు మాజీ ఎఫ్ 1 డ్రైవర్, ప్రస్తుతం జర్నలిస్టుగా పనిచేస్తున్న మార్టిన్ బ్రండిల్ వచ్చాడు. అక్కడ రణ్ వీర్ సింగ్ ఉత్సాహంగా మాట్లాడటం చూసిన మార్టిన్ బ్రండిల్ మీరెవరు..? అంటూ రణ్ వీర్ ను ప్రశ్నించాడు.

ఓపికగా సమాధానం..

మార్టిన్ బ్రండిల్ అడిగిన ప్రశ్నకు రణ్ వీర్ హుందాగా సమాధానం చెప్పాడు. తాను బాలీవుడ్ నటుడు అని..ముంబై నుంచి వచ్చానని బదులిచ్చాడు. దీంతో కంగ్రాట్స్ చెప్పిన మార్టిన్ బ్రండిల్...అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.