సిటీలో ఫుడ్ బిజినెస్కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. కొత్త ఐడియాస్, సరికొత్త కాన్సెప్ట్స్తో ఫుడ్ లవర్స్ను రెస్టారెంట్స్ నిర్వాహకులు అట్రాక్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రోబో రెస్టారెంట్స్, ట్రైన్ హోటల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు సిటీలో జంగిల్ థీమ్తో ఏర్పాటైన రెస్టారెంట్కు పబ్లిక్ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ రెస్టారెంట్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు
హైదరాబాద్ అంటే ఇరానీ చాయ్ , దమ్ బిర్యానీకి కేరాఫ్. ఐతే ఫుడ్ లవర్స్ కొత్తగా ఏదో ఒకటి ట్రై చేయాలనుకుంటారు. ఇలాంటి వారి కోసమే సిటీలో కొత్త, కొత్త థీమ్స్ తో రెస్టారెంట్స్, హోటల్స్ ను అందుబాటులోకి తెస్తున్నారు. డిఫరెంట్ అనుభూతిని పంచే థీమ్ రెస్టారెంట్లు సిటీలో చాలానే వచ్చాయి. జంగిల్, వాటర్ ఫాల్, దాబా స్టైల్, విలేజ్ థీమ్... ఇలా ఎన్నో వెరైటీస్ తో థీమ్ రెస్టారెంట్స్ పబ్లిక్ కి వెల్కం చెప్తున్నాయి.
ప్రజెంట్ మార్కెట్లో ఫుడ్ బిజినెస్కు మంచి డిమాండ్ ఉంది. ఈ బిజినెస్ కు కాస్తంత క్రియేటివిటీ యాడ్ చేసి..కస్టమర్స్ ను నిర్వాహకులు అట్రాక్ట్ చేస్తున్నారు. రెస్టారెంట్ లో క్వాలిటీ ఫుడ్ తో పాటు మంచి ఆంబియన్స్ ఉండేలా చూస్తూ.. రెస్టారెంట్ ఓనర్లు బిజినెస్ లో స్పెషల్ అట్రాక్షన్ గా ఉండాలనుకుంటున్నారు .
వీకెండ్ వచ్చిందంటే చాలు... చాలా మంది ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. రెగ్యులర్ గా ఇంటి ఫుడ్ బోర్ కొట్టి..బయట రెస్టారెంట్లు, హోటల్స్ కు వెళ్తుంటారు. ఐతే రెగ్యులర్ గా వెళ్లే హోటల్స్ కాకుండా కొత్తగా ట్రై చేయాలనుకునే వారిని అట్రాక్ట్ చేసేందుకు థీమ్ రెస్టారెంట్స్ పెరిగాయి. ఇందులో భాగంగానే కూకట్ పల్లిలోని మయుకా రెస్టారెంట్ ఫుడ్ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. జంగిల్ థీమ్ తో ఏర్పాటైన ఈ రెస్టారెంట్ లో ఎంజాయ్ చేస్తున్నామని ప్రజలు చెప్తున్నారు. ఫారెస్ట్ లో కూర్చొని తింటున్న ఫీలింగ్ వస్తుందంటున్నారు.
హోటల్ బిజినెస్ కు మంచి భూమ్ ఉన్నా...మార్కెట్ లో నిలదొక్కుకోవాలంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో పబ్లిక్ ను అట్రాక్ట్ చేయాలని నిర్వాహకులు అంటున్నారు. ఈ జంగిల్ థీమ్ కు కూకట్ పల్లితో పాటు... సిటీ పబ్లిక్ కు బాగా కనెక్ట్ అయ్యారని అంటున్నారు. పెద్దలు, చిన్నారులు ఈ జంగిల్ రెస్టారెంట్ కు వచ్చేందుకు బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారని నిర్వాహకులు చెప్తున్నారు. క్యాలిటీ ఫుడ్ ను కామన్ పబ్లిక్ కు రీజనబుల్ ప్రైజ్ కే అందిస్తున్నామంటున్నారు. రెస్టారెంట్ లో ఉండే యానిమల్స్, గ్రీనరీ, వాటర్ ఫాల్ సెట్ కి కస్టమర్స్ ఫిదా అవుతున్నారని నిర్వాహకులు చెప్తున్నారు
