
బ్రిస్బేన్: హైదరాబాదీ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అరుదైన రికార్డ్ సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసుకోవడంతో అరుదైన క్లబ్ లో చేరాడు. ఆడిన ఫస్ట్ టెస్ట్ సిరీస్ లోనే 5 వికెట్ల ఘనత సాధించడం ఒక విశేషమైతే.. గబ్బా స్టేడియంలో ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన ఐదో ఇండియన్ బౌలర్ గా సిరాజ్ నిలిచాడు. సిరాజ్ కంటే ముందు ఎరాపల్లి ప్రసన్న, బిషన్ సింగ్ బేడీ, మదన్ లాల్, జహీర్ ఖాన్ మాత్రమే ఈ రికార్డ్ సాధించారు.
1968లో ప్రసన్న ఇదే గబ్బా స్టేడియంలో 104 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఈ స్టేడియంలో ఒక ఇండియన్ బౌలర్ అత్యుత్తమ ప్రదర్శన ఇదే. అంతేకాదు సిరాజ్ అద్భుత ప్రదర్శనతో తమకు పెట్టని కోటలా ఉన్న గబ్బాలో ఆస్ట్రేలియా కూడా.. 22 ఏళ్ల తర్వాత తొలిసారి రెండు ఇన్నింగ్స్ లలోనూ ఆలౌటైంది. 1987 నుంచి ఇక్కడ రెండు ఇన్నింగ్స్‌లలో ఆస్ట్రేలియా ఆలౌట్ కావడం ఇది మూడోసారి మాత్రమే. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గానూ సిరాజ్ నిలిచాడు. మూడు టెస్టుల్లో 13 వికెట్లు తీసిన సిరాజ్
A maiden Test five-for in his debut series for Mohammed Siraj ?#AUSvIND | #WTC21 pic.twitter.com/nk3dngjuvX
— ICC (@ICC) January 18, 2021