కరెంట్ షాక్ కొట్టి.. బిల్డింగ్ పైనుంచి పడి..శ్రీకాకుళం వాసి మృతి

కరెంట్ షాక్ కొట్టి.. బిల్డింగ్ పైనుంచి పడి..శ్రీకాకుళం వాసి మృతి

మియాపూర్, వెలుగు: వెల్డింగ్​పనులు చేస్తుండగా విద్యుత్​షాక్​కొట్టడంతో బిల్డింగ్​పైనుంచి పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. మియాపూర్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన దాడియాల సింహయ్య(46) భార్య కుమారి, ఇద్దరు పిల్లలతో కలిసి నగరంలోని యూసుఫ్​గూడ జవహర్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. 

అతను వెల్డింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం మియాపూర్​గోకుల్ ఫ్లాట్స్ కాలనీలో ఓ బిల్డింగ్​మూడో అంతస్తులో వెల్డింగ్ పనులు చేస్తున్నాడు. పక్కనే ఉన్న ఏసీ బోర్డు నుంచి విద్యుత్​ షాక్​కొట్టడంతో పైనుంచి కింద పడ్డాడు. 

ఈ ప్రమాదంలో సింహయ్య తల, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని కూకట్​పల్లిలోని ఓ ప్రైవేట్​హాస్పిటల్​కు తరలించగా.. మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.  కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.