ఇన్​స్టాగ్రామ్​లో కొత్త ఫీచర్​

ఇన్​స్టాగ్రామ్​లో కొత్త ఫీచర్​

కంటెంట్  క్రియేటర్స్, ఇన్​స్టా ఫాలోవర్స్​కి గుడ్​న్యూస్​... ఈమధ్యే పెయిడ్ సబ్​స్క్రిప్షన్ ఫీచర్ తీసుకొచ్చిన ఇన్​స్టాగ్రామ్ త్వరలోనే మరో కొత్త ఫీచర్  తీసుకురాబోతోంది. క్రియేటర్స్ ఎక్కువమంది సబ్​స్క్రయిబర్స్​తో టచ్​లో ఉండేందుకు ఈ ఫీచర్​ ఎంతో ఉపయోగపడుతుంది.  దీంతో  సబ్​స్క్రయిబర్స్​తో ఎక్స్​క్లూజివ్​ పోస్ట్​లు, రీల్స్​, చాట్స్​ షేర్​ చేసుకోవచ్చు. ఇప్పటివరకు సబ్​స్క్రయిబర్​ స్టోరీలను మాత్రమే ​ పోస్ట్ చేసేవాళ్లు క్రియేటర్స్. ఇప్పుడు వాళ్లు  నేరుగా కంటెంట్​ని సబ్​స్క్రయిబర్స్​కు షేర్​ చేయొచ్చు. అంతేకాదు ఒక సబ్​స్క్రయిబర్ చాట్​లో 30 మంది వరకు ఉండొచ్చు. ‘జాయిన్​ చాట్’​ ఆప్షన్ ద్వారా కొత్త వాళ్లు చాట్ చేయొచ్చు. వీటితోపాటు ఫాలోవర్స్​ని ఎంకరేజ్​ చేయడంకోసం సబ్​స్క్రిప్షన్​ స్టోరీ స్టిక్కర్, ప్రోమో రీల్స్ కూడా అందుబాటులోకి తేనునట్టు చెప్పింది ఇన్​స్టాగ్రామ్. 

డిలీట్ టైం పెరిగింది
వాట్సాప్​ గ్రూప్​లో లేదా ఎవరికైనా పర్సనల్​గా పంపిన మెసేజ్​లని డిలీట్​ చేయడానికి ‘డిలీట్​ ఫర్​ ఎవ్రీవన్​’ ఆప్షన్ వాడుతుంటారు చాలామంది. అయితే ఇప్పటివరకు ఒక గంట ఎనిమిది  నిమిషాల 16 సెకన్లలోపు మాత్రమే డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్ పనిచేసేది. దాంతో కొన్ని మెసేజ్​లని డిలీట్ చేయడం కుదరక ఇబ్బంది పడేవాళ్లు యూజర్లు. అయితే ఇకనుంచి ఆ ఇబ్బంది ఉండదు. ​ఎందుకంటే.. యూజర్ల కంఫర్ట్​ కోసం ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ టైం పెంచింది మెటా. ఈ కొత్త ఫీచర్​ సాయంతో ఇకపై  ఒక మెసేజ్​ని 2 రోజుల 12 గంటల్లోపు డిలీట్ చేయొచ్చు. ఈ  ఫీచర్​ బీటా వెర్షన్ యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. 

31 కొత్త ఎమోజీలు 
సోషల్​మీడియాలో పోస్ట్​ల నుంచి వాట్సాప్​ చాటింగ్​ల వరకు ఎమోజీలు బాగా పాపులర్. ఏదైనా పోస్ట్​  మీద అభిప్రాయం ఏంటి?  ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఫలానా వెబ్​సిరీస్​ ఇంట్రెస్టింగ్​గా ఉందా? ...  ప్రశ్న ఏదైనా ఎమోజీ రిప్లయ్​ ఇవ్వడం ఈమధ్య మామూలై పోయింది. ఒక మెసేజ్​లో చెప్పలేని విషయాన్ని ఒక్క ఎమోజీతో ఈజీగా చెప్పేయొచ్చు. అందుకని ప్రతి ఏడాది కొత్త ఎమోజీలు తెస్తున్నాయి కంపెనీలు. ఈ ఏడాది కొత్తగా 31 ఎమోజీలు రాబోతున్నాయి. వాటిలో గ్రే, పింక్​ కలర్​ హార్ట్​ సింబల్స్​తో పాటు జంతువులు, పక్షులు, సముద్ర జీవులు ఉన్నాయి. 

 వర్డ్​లీ  ‘మల్టీ పార్టీ గేమ్​’
పజిల్ గేమ్స్​ని ఇష్టపడేవాళ్లకు కావాల్సినంత థ్రిల్​నిచ్చింది వర్డ్​లీ. సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా రోజూ తమ వర్డ్​లే స్కోర్​ని సోషల్​మీడియాలో పెడుతున్నారు. ఇప్పటి వరకు సోలోగా ఆడుతున్న ఈ గేమ్​ ఇకనుంచి మరింత ఇంట్రెస్టింగ్​గా ఉండబోతుంది. ఈమధ్యే ఈ గేమ్​ని  సొంతం చేసుకున్న న్యూయార్క్​ టైమ్స్​ సంస్థ త్వరలోనే ఇందులో ‘మల్టీ పార్టీ గేమ్​’ అనే కొత్త ఫీచర్​ తేనుంది. ఈ ఫీచర్​ వస్తే... వర్డ్​లీ పజిల్​ని ఒకేచోట ఫ్రెండ్స్​, ఫ్యామిలీతో కలిసి సాల్వ్​ చేయొచ్చు. అదెలాగంటే...  ఒక ప్లేయర్ అనుకున్న ఐదు అక్షరాల పదాన్ని మిగతావాళ్లు గెస్ చేయాలి. సరైన పదాల మీద పసుపు, ఆకుపచ్చ రంగు ఉంటుంది. చిన్న డ్రై– ఎరేజ్​ బోర్డ్​ల మీద ఈ గేమ్​ ఆడాలి. ఒక రౌండ్ అయ్యాక బోర్డ్​ని క్లీన్​ చేసి మళ్లీ ఆట మొదలుపెట్టాలి. 

ఫేస్​బుక్​లో ఐదు ప్రొఫైల్స్​ 
చిన్నప్పటి దోస్తుల​ నుంచి ఆఫీస్​ కొలీగ్స్​ వరకు అంతా  ఫేస్​బుక్​లో ఉంటారు. అందుకని వాళ్ల పేరుతో వెతికి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపిస్తారు చాలామంది. అయితే, ఒకే పేరు మీద పదికి పైగా అకౌంట్లు ఉండడంతో ఫొటో చూస్తే గానీ  రిక్వెస్ట్ ఎవరికి పంపాలో అర్థంకాదు. అందుకు కారణం కొందరికి రెండు మూడు ఫేస్​బుక్​ అకౌంట్స్​ ఉంటాయి. అయితే... ఇకనుంచి  ఒకటికి మించి ఫేస్​బుక్​ అకౌంట్స్​ ఓపెన్​ చేయాల్సిన అవసరం లేదట​. అందుకోసం  త్వరలోనే ఒకే అకౌంట్​ మీద ఐదు ప్రొఫైల్స్​ క్రియేట్​ చేసుకునే ఫీచర్​ తీసుకురాబోతోంది. అది కూడా వాళ్ల సొంత పేరుతో. అకౌంట్​లోకి లాగిన్​ అయ్యాక ఐదు ప్రొఫైల్స్​ క్రియేట్​ చేసుకోవచ్చు. అందరికీ ఒకే ఫేస్​బుక్ అకౌంట్ ఉండాలనే ఉద్దేశంతో ఈ కొత్త ఫీచర్​ తీసుకొస్తోంది ఫేస్​బుక్.