దేవుడే ఇలా డిసైడ్ చేశాడా : జైల్లోనే చనిపోయిన జిలేబీ బాబా

దేవుడే ఇలా డిసైడ్ చేశాడా : జైల్లోనే చనిపోయిన జిలేబీ బాబా

దేవుడినని ప్రచారం చేసుకుంటూ తన శిష్యురాళ్ళపై అత్యాచారానికి పాల్పడి ఫతేబాద్ జైలులో శిక్ష అనుభవిస్తున్న జిలేబి బాబా ( బిల్లు రామ్ ) జైలులోనే మరణించాడు. లైంగిక వేధింపుల కేసులో 14ఏళ్ళ జైలు శిక్ష పడిన జిలేబి బాబా మంగళవారం గుండెపోటుతో మరణించాడు. డయాబెటిక్ పేషంట్ అయిన బాబా ఆరోగ్యం క్షీణించడంతో గుండెపోటుకు గురయ్యాడని జిలేబి బాబా తరపు లాయర్ అన్నారు. మంగళవారం రాత్రి బిల్లు రామ్ ఇబ్బందిగా ఉందని చెప్పిన వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లామని, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారని అన్నారు ఎస్ఐ భూప్ సింగ్.

బుధవారం పోస్ట్ మార్టం అనంతరం బుధవారం బిల్లు రామ్ అంత్యక్రియలు నిర్వహించారు. 2018లో రేప్ కేసులో జిలేబి బాబా అరెస్టైన తర్వాత అతని అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రబుద్దుడిని అరెస్ట్ చేసిన పోలీసులు 120సెక్స్ వీడియోలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. అంతే కాకుండా తన వద్దకు భూత వైద్యానికి వచ్చిన చాలా మంది మహిళలను జిలేబి బాబా బలవంతం చేశాడని పోలీసుల విచారణలో తేలింది. 2017లోనే ఇతన్ని లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ చేయగా, బెయిల్ మీద బయటికి వచ్చాడు. మొత్తానికి చేసిన పాపాలు పండి జైలుకు వెళ్లిన దొంగ బాబా శిక్ష పూర్తికాక ముందే మరణించాడు, బహుశా మిగిలిన శిక్ష నరకంలో అనుభవించాల్సి ఉంది కాబోలు.