Ali Fazal Thug life: థగ్ లైఫ్లో మీర్జాపూర్‌ నటుడు..ఇద్దరు దిగ్గజాలతో పనిచేయడం గౌరవంగా ఉందంటూ పోస్ట్‌

Ali Fazal Thug life: థగ్ లైఫ్లో మీర్జాపూర్‌ నటుడు..ఇద్దరు దిగ్గజాలతో పనిచేయడం గౌరవంగా ఉందంటూ పోస్ట్‌

 

విశ్వ నటుడు కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముప్ఫై ఆరేళ్ల తర్వాత తెరకెక్కుతోన్న ‘థగ్ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’. పాన్‌ ఇండియా స్థాయిలో భారీ తారాగణంతో, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులతో రూపొందుతోంది.ఈ చిత్రంలో త్రిష, దుల్కర్ సల్మాన్, శింబు, జయంరవి, ఐశ్వర్య లక్ష్మీ, గౌతం కార్తిక్, జోజు జార్జ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే కమల్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెస్మరైజ్ చేసిన టీమ్..బుధవారం శింబు పాత్రను పరిచయం చేశారు. ఇందులో శింబు డిఫరెంట్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు.

తాజాగా థగ్ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీలోకి మరో స్టార్ యాక్టర్ ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో బాలీవుడ్‌ నటుడు అలీ ఫజల్‌ భాగమయ్యారు. సినిమాలతో పాటు ‘మీర్జాపూర్‌’ వంటి హిట్‌ సిరీస్‌లతో గుర్తింపుతెచ్చుకున్న ఈ హీరో  (Ali Fazal) ‘థగ్‌ లైఫ్‌’లో నటించడం హ్యాపీ ఉందంటూ స్పెషల్ నోట్‌ విడుదల చేశారు.

'థగ్‌ లైఫ్‌’లో నటిస్తుండడం ఎంతో థ్రిల్‌గా ఉంది.కీలకపాత్రలో నటిస్తున్నాను.ఈ చిత్రంతో టాలీవుడ్‌ ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నా. భారతీయ సినిమాకు చెందిన ఇద్దరు దిగ్గజాలతో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా గౌరవంగా ఉంది. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రను ఇచ్చారు. తెరపై దానికి జీవం పోసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని అలీ వెల్లడించాడు. 

ఇక ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్‌ రెహమాన్ మ్యూజిక్‌ అందిస్తుండగా..రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్‌,  మద్రాస్ టాకీస్‌, రెడ్ జియాంట్ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.