Health Alert: ఇవి తింటే సంపూర్ణ ఆరోగ్యం..ఐసీఎంఆర్ చెబుతోంది

Health Alert: ఇవి తింటే సంపూర్ణ ఆరోగ్యం..ఐసీఎంఆర్ చెబుతోంది

మీరు రోజు తినే భోజనం గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? ఒకవేళ ఆలోచిస్తే..ఏం తింటున్నాం..అది ఆరోగ్యానికి మంచిదేనా.. లేక చెడు చేస్తుందా..మనం తినే ఫుడ్ లో క్వాలిటీ ఉందా?..ఉంటే మనం తినే ఆహారంతో శరీరానికి సరిపడా ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ అందుతున్నాయా..? వంటి సందేహాలు కలగక మానవు. అయితే భారతీయుల ఆహారపు అలవాట్లు, ఆరోగ్యంపై ప్రభావం ఎలా ఉందనే విషయాలపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అధ్యయనం చేసింది. 

ఈ అధ్యయనంలో సగానికిపైగా జనాభా సరైన ఆహారం తీసుకోవడం లేదని వెల్లడించింది. దీంతో ఆనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజువారి ఆహారంలో ఏమేం పదార్థాలు ఉండాలో చెప్పింది. ఐసీఎంఆర్ చెప్పిన ఆహార పదార్థాలను తప్పకుండా తీసుకుంటే ప్రోటీన్ లోపం, డయాబెటిస్, గుండె జబ్బుల వంటి నాన్ కమ్యూనిటీకల్ డెసీజ్ లనుంచి బయటపడొచ్చని తెలిపింది.  

ICMR ఏం చెబుతుందంటే.. 

ప్రతి రోజు మనం తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా ఉండాలంటోంది. మనం తీసుకునే ఆహారంలో ఎనిమిది రకాల పదార్థాలు ఉండాలట. వాటిలో తప్పనిసరిగా పండ్లు కూరగాయాలు మస్ట్ గా ఉండాలని ICMR చెపుతోంది. 

రోజు తినే ఆహారంలో ఉండాల్సిన ఆహార పదార్థాలు 

  • రోజువారి ఫుడ్ లో బచ్చలికూర, నారింజ, మామిడి తోపాటు తప్పనిసరిగా టమోటా వంటి పండ్లు ఆకుకూరలు , కూరగాయలు ఉండాలి. 
  • అదనపు పోషకాల కోసం బీట్ రూట్, క్యారట్ , దుంపలు తినాలి
  • తృణధాన్యాలు, మిల్లెట్లు ఇవి కనీసం మనం తినే ఆహారంలో 45 శాతం ఉండాలి. తెల్ల బియ్యం కంటే బజ్రా, జొన్న వంటి తృణ ధాన్యాలతో చేసిన ఆహారం తీసుకోవాలి. 
  • కాయధాన్యాలు అని కూడా పిలువబడే పప్పులు, మొక్కల ఆధారిత ప్రోటీన్ ను అందిస్తాయి. 
  • గుడ్లు.. ప్రోటీన్,అవసరమైన పోషకాలు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి గుడ్డును కూడా రోజువారి ఆహారంలో ఉండాలి. 
  • ఇక ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ల కోసం గింజలు, విత్తనాలు శనగలు, పల్లీలు, బఠానీల వంటివి తీసుకోవాలి 
  • పెరుగుతున్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు పాలు, పెరుగు (పెరుగు)  చాలా ముఖ్యం. 

ఈ ఎనిమిది రకాల ఆహార పదార్ధాలు మన రోజూవారి ఆహారంలో ఉంటే ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుందని ఐసీఎంఆర్ చేసిన ఇటీవల పరిశోధనలో నివేదికను సోషల్ మీడియాల ఫ్లాట్ ఫారం X లో వెల్లడించింది. భారతీయుల కోసం ఆహార మార్గదర్శకాలను (DGI) ఆవిష్కరించింది. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని ప్రోత్సహించడానికి, పోషకాహార లోపాలు , నాన్-కమ్యూనికేషన్ వ్యాధులను దూరం చేసేందుకు తోడ్పడుతుంది.