పెట్రోల్​ క్యాన్​ పేలి అగ్ని ప్రమాదం.. మూడు వెహికల్స్, చికెన్ షాప్ దగ్ధం

పెట్రోల్​ క్యాన్​ పేలి అగ్ని ప్రమాదం.. మూడు వెహికల్స్, చికెన్ షాప్ దగ్ధం

ఖైరతాబాద్‌‌, వెలుగు: బోరబండ ఎన్ఆర్ఆర్ పురంలో పెట్రోల్​క్యాన్​పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో షెడ్‌‌ పక్కనే నిలిపి ఉన్న రెండు కార్లు, ఓ బైక్‌‌ పూర్తిగా దగ్ధమయ్యాయి. బోరబండకు చెందిన ఫయాజ్ అనే వ్యక్తి గత కొంత కాలంగా ఎన్​ఆర్​పురం సైట్-3లో అక్రమంగా పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నాడు. బంకుల్లో కొనుక్కొచ్చి అక్రమంగా విక్రయిస్తున్నాడు.

గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బంక్‌‌ నుంచి పెట్రోల్ తీసుకొచ్చి క్యాన్లను కారు నుంచి కిందకు దింపుతున్నాడు. అయితే అప్పటికే పక్కనే ఉన్న చెత్త కుప్పకు ఎవరో నిప్పు పెట్టడంతో.. ఆ వేడికి అక్కడ దింపిన పెట్రోల్​క్యాన్​పేలిపోయింది. మంటలు వ్యాపించి పక్కనే ఉన్న పంచర్ షాప్, చికెన్ షాప్ లకు వ్యాపించాయి.

దీంతో పంచర్ షాప్ లోని రెండు కార్లు, ఓ బైక్ పూర్తిగా దగ్ధమయ్యాయి. పంచర్ షాప్ యజమాని ఎస్సార్ నగర్ పీఎస్​లో ఫిర్యాదు చేయడంతో ఫయాజ్​ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు పలు కేసులు నమోదు చేశారు.