అక్షర క్షిపణి ‘అలిశెట్టి ప్రభాకర్ ’ : వక్తలు

అక్షర క్షిపణి ‘అలిశెట్టి ప్రభాకర్ ’ : వక్తలు

పంజాగుట్ట, వెలుగు: అన్నార్థుల ఆర్తనాదాలను అక్షర క్షిపణులుగా మార్చిన ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్ అని వక్తలు కొనియాడారు. ఆదివారం సోమాజిగూడలోని ప్రెస్‌‌క్లబ్‌‌లో అలిశెట్టి ప్రభాకర్ యాదిలో సంగోష్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కవులు మాట్లాడుతూ.. కవితాయుగంలో అలుపెరుగని భాస్కరుడిగా అలిశెట్టి పేరొందారన్నారు. 

‘కవికి కాదేదీ అనర్హం’ అన్న నినాదాన్ని ఆచరణలో పెట్టిన మహాకవి అని కొనియాడారు. సీనియర్ పాత్రికేయులు, మహీంద్రా విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ లా డీన్ మాడభూషి శ్రీధర్, కవులు విఠల్, రాజేందర్, బి.ఎస్.రాములు, కొత్త విజయభాస్కర్, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.