
జూబ్లీహిల్స్, వెలుగు: టీమిండియా ఆసియా కప్గెలవడంతో సంబురాలు జరుపుకుంటే పోలీసులు కొట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని బంజరాహిల్స్ ఏసీపీ వెంకట్ రెడ్డికి శ్రీనగర్ కాలనీకి చెందిన అజయ్ ఫిర్యాదు చేశాడు. ఆదివారం రాత్రి తమ నివాసంలో మరికొందరు స్నేహితులతో కలిసి ఇండియా గెలిచిన సందర్భంలో సెలబ్రేషన్స్చేసుకున్నామని, ఇంట్లోకి చొరబడి మరీ బంజారాహిల్స్ ఎస్ఐ, పోలీసు సిబ్బంది విచక్షణారహితంగా కొట్టారన్నారు.
దీనిపై బంజరాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రను వివరణ కోరగా.. మద్యం మత్తులో యువకులు న్యూసెన్స్చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి వెళ్లి చెదరగొట్టే ప్రయత్నం చేశారన్నారు. అజయ్ ఫిర్యాదును పరిశీలించి కేసు నమోదు చేస్తామన్నారు. ఫిర్యాదుదారుడితో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి ఉన్నారు.