గండిపేట, వెలుగు: స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ ఓ యువకుడు మృతి చెందాడు. కృష్ణానగర్‌లోని జిరా ఆసిఫ్‌నగర్ కు చెందిన కజిన్ పాషా (20) తన స్నేహితులతో కలిసి ఆదివారం సరదాగా ఈత కొట్టేందుకు హైదర్‌గూడలోని పూల్‌లోకి వెళ్లాడు. ఈత కొడుతున్న క్రమంలో ఒక్కసారిగా లోతైన ప్రాంతానికి వెళ్లడంతో నీటిలో మునిగిపోయాడు. యువకుడు మునిగిపోతున్నాడని గమనించిన స్నేహితులు.. వెంటనే అతడిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మునిగి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
