
రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి గర్భవతిని చేశాడు ఓ యువకుడు. బతుకుదెరువు కోసం బీహార్ రాష్ట్రానికి చెందిన దంపతులు బడంగ్ పేట్ లోని టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అదే ఇంటి పక్కన నివాసముండే పాన్ షాప్ నిర్వాహకుడు రాకేష్(24)@ రింకు అనే వ్యక్తి బాలికకు మాయమాటలు చెప్పి గత సంవత్సరం నుంచి బాలికపై అత్యాచారం చేశాడు.
అయితే బాలికలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు .. నిలదీయగా అసలు విషయం చెప్పింది. బాలిక ఏడు నెలల గర్భవతి అని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు తల్లిదండ్రులు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మీర్ పేట్ పోలీసులు.