హైదరాబాద్ లో దారుణం జరిగింది. చెల్లిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడన్న కోపంతో యువకుడిపై కత్తితో దాడి చేశాడు యువతి సోదరుడు. 14 కత్తిపోట్లు పడటంతో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.
నేరెడ్‌మెట్‌కు చెందిన అజయ్, రామలింగంపల్లికి చెందిన యువతి గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. మూడు రోజుల క్రితం యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు అజయ్. విషయం తెలిసి యువతికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. ఫిబ్రవరి 25 న యువతి మొబైల్ నుంచి రామలింగంపల్లికి రావాలంటూ అజయ్‌కి మెసేజ్ చేశాడు యువతి సోదరుడు. ప్రియురాలే పిలిచిందనుకుని వెళ్లిన అజయ్ ను రామలింగంపల్లి గ్రామ శివార్లలోకి రాగానే విచక్షణా రహితంగా దాడి చేశారు. అజయ్ కల్లలో కారం చల్లి కత్తులతో దాడి చేశాడు యువతి సోదరుడు, అతని స్నేహితులు. అజయ్ పై 14 సార్లు కత్తితో పొడిచారు. అపాస్మరక స్థితిలో పడిపోవడంతో చనిపోయాడని భావించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు యువతి సోదరుడు, అతని స్నేహితులు. సమాచారం అందుకున్న పోలీసులు, అజయ్ ని గాంధీకి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న అజయ్ పరిస్థితి విషమంగా ఉంది.
