ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య .. రాజేంద్రనగర్పరిధిలో ఘటన

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య .. రాజేంద్రనగర్పరిధిలో ఘటన

గండిపేట, వెలుగు: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు ఉరేసుకుని మృతి చెందాడు. రాజేంద్రనగర్​పరిధిలోని హనుమాన్ నగర్ కు చెందిన ధనుశ్ (22) హౌస్ కీపింగ్ పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం పనికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి.. సర్వీస్ రోడ్ పక్కన ఉన్న చెట్ల పాదాల్లో చెట్టుకు ఉరేసుకొని కన్పించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ధనుశ్ తండ్రి దుర్గన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.