ఓయో రూమ్ లో యువకుడు సూసైడ్.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

ఓయో రూమ్ లో యువకుడు సూసైడ్.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

కుషాయిగూడ, వెలుగు: ఓయో రూమ్​లో ఓ యువకుడు సూసైడ్​చేసుకున్నాడు. సీఐ భాస్కర్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జై జవాన్ కాలనీకి చెందిన మన్నె నరేందర్(30) తండ్రి చనిపోగా.. తల్లి జగదాంబ ఉంది. నరేందర్​గతంలో ఓ షాపింగ్​మాల్​లో సేల్స్​మెన్​గా పని చేశాడు. స్టాక్​మార్కెట్​లో పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై సోమవారం మధ్యాహ్నం ఈసీఎల్ కమలానగర్ లోని ఆర్ స్క్వేర్ ఓయో రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.