పోస్టల్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, లెటర్లు చెత్తకుప్పలో కనిపించాయి. ప్రభుత్వ శాఖల నుంచి పోస్టాఫీసుకు వచ్చే ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, ఇన్సూరెన్స్ బాండ్ పేపర్లు తదితర పత్రాలను సంబంధిత వ్యక్తులకు అందించాల్సి ఉంటుంది.
వాటిని మెదక్ జిల్లా కౌడిపల్లి శివారులోని అటవీ ప్రాంతం బట్టమ్మ ఆలయ ప్రాంగణంలో వాటిని పారేసినట్లు గుర్తించారు. శనివారం వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు గుర్తించారు. పోస్టల్ శాఖ నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతుండగా, ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. – కౌడిపల్లి/శివ్వంపేట, వెలుగు
