ఫొటోలు వైరల్ : మాజీ భార్యతో కలిసి అమీర్ ఖాన్ ప్రత్యేక పూజలు

ఫొటోలు వైరల్ : మాజీ భార్యతో కలిసి అమీర్ ఖాన్ ప్రత్యేక పూజలు

ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ ముంబైలోని అమీర్ ఖాన్ ప్రొడక్షన్ కార్యాలయంలో పూజలు నిర్వహించారు. లోహపు కలశాన్ని చేతపట్టి..  తలపై టోపీ, నుదుటన తిలకం, మెడలో కండువా, స్వెట్ షర్ట్, జీన్స్ ధరించి  అమీర్ ఖాన్ స్వయంగా పూజలు చేశారు.  దీనికి సంబంధించిన ఫొటోలను అద్వైత్ చందన్ అనే వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. అయితే ఏ సందర్భంగా ఈ పూజలు నిర్వహించారనేది తెలియరాలేదు. ఈ కార్యక్రమంలో అమీర్ ఖాన్ తో పాటు ఆయన మాజీ భార్య కిరణ్ రావు కూడా పాల్గొన్నారు. 

‘‘ఏడాది తర్వాత మళ్లీ మీకు సినిమాల్లో కనిపిస్తా.  వచ్చే సంవత్సర కాలమంతా  నా సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తా. పానీ ఫౌండేషన్ కు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి ’’ అని వారం క్రితమే అమీర్ ఖాన్ ప్రకటించారు.  కాగా, అమీర్ ఖాన్ లేటెస్ట్ సినిమా  లాల్ సింగ్ చద్దాకు బాక్సాఫీస్ నుంచి ఆశించిన స్పందన రాని సంగతి తెలిసిందే.