రాజ్యసభ నుంచి ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ సస్పెండ్

రాజ్యసభ నుంచి ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ సస్పెండ్

మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై చర్చకు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌ను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్  ధన్ ఖర్ సస్పె్ండ్ చేశారు. వర్షాకాల సమావేశాల సెషన్  మొత్తం సభకు హాజరు కాకుండా ఆయనపై వేటు వేశారు.  హౌస్‌లోని వెల్‌లోకి దూకి నినాదాలు చేశారనే ఆరోపణతో సంజయ్  సింగ్‌ను సస్పెండ్ చేశారు. 

ఉదయం 11 గంటలకు రాజ్యసభ సమావేశం కాగానే  విపక్షాలు మణిపూర్‌ అంశంపై ప్రధాని మోదీ సభకు వచ్చి ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ం చేశాయి.   సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగించొద్దని ఛైర్మన్‌ హెచ్చరించినా వారు వినిపించుకోలేదు. ఈ క్రమంలోనే ఆప్‌ ఎంపీ సంజయ్‌ కుమార్‌ అనుచిత ప్రవర్తనకు పాల్పడుతున్నారని ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ హెచ్చరించారు. 

ALSO READ:ఢిల్లీలో అమిత్ షాతో బండి సంజయ్ భేటీ

అనంతరం సంజయ్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేయాలని రాజ్యసభ పక్ష నేత పీయూష్‌ గోయల్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. విపక్షాల ఆందోళనల నడుమే ఈ తీర్మానంపై మూజువాణీ ఓటింగ్‌ చేపట్టిన ఛైర్మన్‌.. ఆప్‌ ఎంపీని ఈ వర్షాకాల సమావేశాల మొత్తానికి సస్పెండ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు

సింగ్‌ను సస్పెండ్ చేసిన వెంటనే  విపక్ష సభ్యులు సభలో గందరగోళం సృష్టించడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. మణిపూర్ అంశంపై సభలో ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.  అటు లోక్ సభ కూడా  మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా.  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 2023 జూలై 20న ప్రారంభం కాగా  ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి.