హైదరాబాద్, వెలుగు: జ్యువెలరీ కంపెనీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలోని తమ అన్ని షోరూమ్‌లలో ‘ఆషాఢ శుభ లాభ్’ పేరిట ఆషాడం పండుగ ఆఫర్లను ప్రకటించింది. వినియోగదారులు బంగారం, అన్‌కట్, రత్నాల ఆభరణాల వాల్యూ అడిషన్‌పై 30శాతం వరకు తగ్గింపు, అలాగే వజ్రాభరణాల డైమండ్ విలువపై 30శాతం వరకు తగ్గింపు పొందొచ్చని, అదనంగా, పాత బంగారం మార్పిడిపై 0శాతం తగ్గింపు ప్రయోజనాన్ని కూడా పొందొచ్చని సంస్థ పేర్కొంది. ఈ ఆఫర్లు 2026 జులై 15 నుంచి ఆగస్టు 12 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలోని తమ స్టోర్లలో అందుబాటులో ఉంటాయని మలబార్ గ్రూప్ ఛైర్మన్ ఎం.పీ. అహమ్మద్ అన్నారు.
