మూడు రకాల వైద్య పరీక్షలు
ఢిల్లీ : వింగ్ కమాండర్ అభినందన్‌కు శనివారం మూడు రకాల వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. మొదట బగ్ స్కాన్ చేస్తారు. పాక్ సైన్యం ఆయన శరీరంలో ఏవైనా చిప్స్ అమర్చిందన్న విషయం తేల్చేందుకు ఈ స్కాన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత సైకలాజికల్ టెస్టులు చేపడుతారు. ఆయనను పాక్ ఆర్మీ చిత్రహింసలకు గురి చేసి ఏవైనా విలువైన రక్షణ రహస్యాలను తెలుసుకుందా అన్న కోణంలో ఇది సాగుతుంది. శరీరంపై ఉన్న గాయాలకు కూడా పరీక్షలు నిర్వహిస్తారు. పాక్ ఆర్మీకి చిక్కినప్పుడు అభినందన్ రక్తమోడుతూ కనిపించారు. పైగా శుక్రవారం కూడా ఆయన ముక్కుపై గాయం కనిపించింది.
దీనికి గల కారణాలను వైద్య పరీక్షల్లో నిర్ధారించనున్నారు. వీటన్నింటి తర్వాత కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ, అధికారులు కానీ ఆయనను విచారిస్తారు. ఇప్పటికే అభినందన్‌ను కలుసుకునేందుకు ఆయన తల్లిదండ్రులు ఢిల్లీకి చేరకున్నారు. ఇన్ని దశల పరీక్షల తర్వాత వర్తమాన్‌ను ఇంటికి పంపుతారు.
తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు:IAF అధికారులు పాక్ నుంచి వింగ్ కమాండర్ అభినందన్ సురక్షితంగా రావడం అందరిలో సంతోషాన్ని నింపిందని IAF ఉన్నతాధికారులు కపూర్, ప్రభాకరన్ అన్నారు. బోర్డర్ వద్ద మీడియా ప్రతినిధులు వారిని ప్రశ్నించగా.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై దృష్టి సారించామని చెప్పా రు. తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోందని, పూర్తి పరీక్షల నిమిత్తం ఢిల్లీకి తీసుకెళ్తున్నామన్నారు.
