వైభవ్‌తో ఓపెనింగ్ చేసేది ఎవరు?.. అభిషేక్ శర్మా లేదా ప్రభ్‌సిమ్రన్?.. భారత్ ప్లేయింగ్ XI ఇదే!

వైభవ్‌తో ఓపెనింగ్ చేసేది ఎవరు?.. అభిషేక్ శర్మా లేదా ప్రభ్‌సిమ్రన్?.. భారత్ ప్లేయింగ్ XI ఇదే!

IND vs ZIM 2nd T20I: జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో విజయం సాధించడంతో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు తమ వరుస పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో జరిగిన సిరీస్‌లలో వరుసగా 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఇండియన్ టీమ్ కి ఈ విజయం ఎంతో రిలీఫ్ ఇచ్చింది. ప్రస్తుతం 3 టీ20ల సిరీస్‌లో 1–0 ఆధిపత్యంలో ఉన్న శ్రేయస్ సేన, యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే లక్ష్యంతో రెండో టీ20 కోసం ప్లేయింగ్ XIలో కొన్ని మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన ఓపెనర్ అభిషేక్ శర్మపై వేటు పడే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తుంది. 

రైట్-లెఫ్ట్ కాంబినేషన్‌పై దృష్టి: 
ఒకవేళ అభిషేక్ శర్మను తుది జట్టు నుంచి తప్పిస్తే, అతడి స్థానంలో ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించే అవకాశం ఉంది. హరారే వేదికగా జరిగిన తొలి టీ20లో భారత టాప్-7 బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మినహా మిగిలిన ఆరుగురూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే కావడం గమనార్హం. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను జట్టులోకి తీసుకోవడంతో టాప్ ఆర్డర్‌లో మంచి వైవిధ్యంతో పాటు సరైన రైట్-లెఫ్ట్ కాంబినేషన్ లభిస్తుంది. అంతేకాకుండా అతడు వికెట్ కీపర్ కూడా కావడం జట్టుకు అదనపు ప్రయోజనకరంగా మారనుంది.

►ALSO READ | ఐదు నెలల తర్వాత భారత్ విజయం.. జట్టు కాంబినేషన్‌పై ప్రశ్నల వర్షం!

సూర్యవంశీతో ఓపెనింగ్ చేసేందుకు మరో ఛాన్స్: 
మరోవైపు 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ఇది కేవలం ఐదో అంతర్జాతీయ మ్యాచ్ మాత్రమే కావడం విశేషం. అతి పిన్న వయసున్న ఆటగాడు ఎలాంటి ఒత్తిడి లేకుండా రాణించాలంటే టాప్ ఆర్డర్‌లో నిలకడైన భాగస్వామి అవసరమని మేనేజ్‌మెంట్ భావిస్తే, అభిషేక్ శర్మకు మరొక అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. మరీ చూడాలి ఇవాళ ప్లేయింగ్ ఎలెవన్ లో ఎవరికి స్థానం లభిస్తుందో అనేది. 

భారత తుది జట్టు అంచనా: 
అభిషేక్ శర్మ / ప్రభ్‌సిమ్రన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్