మెడెలిన్ (కొలంబియా): ఇండియా టాప్ ఆర్చర్ అభిషేక్ వర్మ.. వరల్డ్ కప్ స్టేజ్–3లో గోల్డ్ మెడల్‌తో మెరిశాడు. శనివారం రాత్రి జరిగిన మెన్స్ కాంపౌండ్ ఇండివిడ్యువల్ ఫైనల్లో అభిషేక్ 148–146తో జేమ్స్ లుట్జ్ (అమెరికా)పై గెలిచి టాప్ ప్లేస్‌లో నిలిచాడు. గత రెండు స్టేజ్‌లకు దూరంగా ఉన్న ఇండియన్ ఆర్చర్.. ఈసారి మాత్రం అద్భుతమైన గురితో ఆకట్టుకున్నాడు. ఓవరాల్‌గా అభిషేక్‌కు వరల్డ్‌కప్‌లో ఇది మూడో స్వర్ణం కావడం విశేషం. 2015 (పోలెండ్), 2021 (పారిస్)లో గోల్డ్ మెడల్స్ నెగ్గాడు.
