V6 News

రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా సివిల్ సప్లైస్ డీటీ రవీందర్ నాయక్..

రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా సివిల్ సప్లైస్ డీటీ రవీందర్ నాయక్..

రంగారెడ్డి జిల్లా కొంగరకొలాన్ లోని జిల్లా కలెక్టర్ ఆఫీసులో సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ డీటీగా పని చేస్తున్న రవీందర్ నాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మంగళవారం ( డిసెంబర్ 9 ) ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో పట్టుబడ్డాడు రవీందర్ నాయక్. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

రంగారెడ్డి జిల్లా కొంగరకొలాన్ లోని జిల్లా కలెక్టర్ ఆఫీసులో సివిల్ సప్లైస్ డీటీగా విధులు నిర్వహిస్తున్న రవీందర్ నాయక్ రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. 

షాద్ నగర్ లోని రాఘవేంద్ర ఉడిపి హోటల్ లో అన్నారం గ్రామానికి రేషన్ డీలర్ యాదయ్య నుండి  20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.ఏసీబికి చిక్కిన రవీందర్ నాయక్ ను రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు తీసుకువచ్చి విచారిస్తున్న ఏసీబీ అధికారులు.