మంచిర్యాల జిల్లాలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. శనివారం ( అక్టోబర్ 25 ) నిర్వహించిన ఈ సోదాల్లో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ను పట్టుకున్నారు ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. పక్కా సమాచారంతో జిల్లా కేంద్రంలోని ఇక్బల్ అహ్మద్ నగర్ లోని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ నివాసంలో దాడులు నిర్వహించారు అధికారులు. ఈ క్రమంలో రూ. రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ రాథోడ్ బిక్కు ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు.
సస్పెండ్ అయిన ఉద్యోగికి సంబంధించి పెరిగిన వేతనాలు మంజూరు చేసే విషయంలో రాథోడ్ రూ.8 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిపారు అధికారులు. మొదటి విడత కింద రూ. రెండు లక్షలు లంచం ఇవ్వాలని డీల్ కుదుర్చుకున్నాడు రాథోడ్. ఈ క్రమంలో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు రాథోడ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
రాథోడ్ బిక్కును అదుపులోకి తీసుకున్న అధికారులు మంచిర్యాల కలెక్టరేట్ లో విచారిస్తున్నారు.ఆసిఫాబాద్ ఇచ్చోడలోని రాథోడ్ బిక్కు ఇంట్లో సోదాలు జరుపుతున్నారు ఏసీబీ అధికారులు. రాథోడ్ ఆసిఫాబాద్ జిల్లా ఇంచార్జిగా కూడా పనిచేస్తున్నట్లు తెలిపారు అధికారులు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే... భయపడకుండా తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు ఏసీబీ అధికారులు.
