అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి హైదరాబాద్ లో దాడులకు దిగారు. మణికొండలో విద్యుత్ శాఖ ఏడీ అంబేడ్కర్ ఇంట్లో మంగళవారం (సెప్టెంబర్ 16) ఉదయం సోదాలు నిర్వహిస్తున్నారు. ఏడీ అంబేద్కర్ ఇల్లు, కార్యాలయాలు , బంధువుల ఇళ్లల్లో ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.
మణికొండ , నార్సింగి డివిజన్లో AD గా పనిచేస్తున్న అంబేద్కర్.. అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు.. పలు చోట్ల అక్రమస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ పరిశీలిస్తున్నారు. భారీగా అగ్రికల్చర్ ల్యాండ్స్, ప్లాట్స్, భవనాలను కొనుగోలు చేసినట్లు సమాచారం.
కూడ బెట్టిన ఆస్తులను బంధువును బినామీలుగా ఉంచినట్లుగా గుర్తించారు అధికారులు. అవినీతి ఆస్తుల చిట్టాను లెక్కపెడుతున్నారు ఏసీబీ అధికారులు.
