హైదరాబాద్ సిటీలో కరెంట్ ఆఫీసులో ADE.. గచ్చిబౌలిలో 5 అంతస్తుల బిల్డింగ్, సూర్యాపేటలో 10 ఎకరాల భూమి

హైదరాబాద్ సిటీలో కరెంట్ ఆఫీసులో ADE.. గచ్చిబౌలిలో 5 అంతస్తుల బిల్డింగ్, సూర్యాపేటలో 10 ఎకరాల భూమి

ఇబ్రహీంబాగ్ లో విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఏడిఈ అంబేద్కర్ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. మెదక్ ,సూర్యపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలోని పలు ప్రాంతాల్లో ఆయన బంధువుల ఇండ్లలో  15 టీంలు   ఒకేసారి సోదాలు  చేస్తున్నాయి.  సెప్టెంబర్ 16న ఉదయం 5గంటల నుంచి సోదాలు చేస్తున్న అధికారులు ఏడీఈ అధికారి అంబేద్కర్ భారీగా అక్రమాస్తులు కూడగట్టినట్లు గుర్తించారు.  

ఇప్పటి వరకు సోదాల వివరాలను రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పి ఆనంద్ కుమార్ వెల్లడించారు.  గతంలో ఏడీఈ అధికారి అంబేద్కర్  మీద వచ్చిన ఆరోపణ నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించామని చెప్పారు.  ఇష్టానుసారంగా అధికారులతో కుమ్మక్కై అక్రమ సంపాదనను సంపాదించారని తెలిపారు.  

గచ్చిబౌలిలో ఐదు అంతస్తుల భవనం.. ప్లాట్లు సూర్యాపేటలో 10 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్, నర్కుడ లో 1000 యాడ్స్ ఉన్న స్థలం, కొండాపూర్ లో ఉన్న ట్రిపుల్ బెడ్ రూం ఫ్లాట్ ను ప్రస్తుతం గుర్తించామన్నారు.  ఇంకా  బినామీల పేరు మీద పలు ఆస్తులున్నాయని.. వాళ్ళు ఎవరు అనేది ప్రస్తుతం ఆరా తీస్తున్నామని చెప్పారు.  

అన్ని డాక్యుమెంట్స్ ను పరిశీలించామన్నారు.  గతంలో పట్టుబడిన అధికారులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు  ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని  మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు డీఎస్పీ ఆనంద్ కుమార్ .