- తహసీల్దార్ కారులో అణువణువూ తనిఖీ
- భూముల మ్యుటేషన్, ధరణి దరఖాస్తుల్లో అక్రమాలు
గండిపేట, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా ఈ ఆఫీసులో భూ సంబంధిత పనులు, సర్టిఫికెట్ల జారీలో భారీగా అవినీతి జరుగుతోందని బాధితుల నుంచి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో ఏసీబీ డీసీపీ ఆనంద్ ఆధ్వర్యంలో శుక్రవారం సోదాలు చేశారు. ఈ సందర్భంగా ఆఫీసులోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ప్రధానంగా భూముల మ్యుటేషన్, ధరణి సంబంధిత దరఖాస్తుల విషయంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. అలాగే, తహసీల్దార్రవీందర్దత్ కారులో అణువణువూ వెతికారు. ఈ విషయమై డీఎస్పీ ఆనంద్మాట్లాడుతూ ప్రాథమిక ఎంక్వైరీలో రెండు అంశాల్లో అవినీతి జరిగినట్లు గుర్తించామని, రెండు కీలక వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు.
