ల్యాప్​టాప్ వాడకాన్ని బట్టి యాక్సెసరీస్ కూడా యాడ్  చేసుకోవాలి

ల్యాప్​టాప్ వాడకాన్ని బట్టి యాక్సెసరీస్ కూడా యాడ్  చేసుకోవాలి

కొత్తగా ల్యాప్​టాప్ వాడుతున్నవాళ్లు దాంతోపాటు కొన్ని యాక్సెసరీస్ తప్పకుండా కొనుక్కోవాలి. ల్యాప్​టాప్ వాడకాన్ని బట్టి యాక్సెసరీస్ కూడా యాడ్  చేసుకోవాలి. వీటిని వాడితే ల్యాప్​టాప్ లైఫ్ పెరగడంతో పాటు పదే పదే పాడుకాకుండా ఉంటుంది. అలాంటి గాడ్జెట్స్ కొన్ని..

ల్యాప్ డెస్క్

ఇంట్లో ఉండి పనిచేసేవాళ్లలో చాలామంది ల్యాప్​టాప్ కోసం ప్రత్యేకంగా డెస్క్​ని కొనుక్కోవడం లేదు. సోఫాలో కూర్చొని, బెడ్ మీద పడుకుని ల్యాప్​టాప్ ఆపరేట్ చేస్తున్నారు. అలాంటప్పుడు మౌస్  ‌‌వాడడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ మినీ ల్యాప్  టాప్​డెస్క్​ని కొనడం బెటర్‌‌‌‌‌‌‌‌. ఇది తీసుకుంటే సోఫాలో కూర్చుని కూడా ఈజీగా పని చేయొచ్చు. ఔట్​డోర్​లో పనిచేయడానికి కూడా ఇది బాగా యూజ్​ అవుతుంది. దీనికి ఫోన్​ స్లాట్​తోపాటు మౌస్​ప్యాడ్  ‌‌కూడా ఉంటుంది. దీని కింది భాగంలో ఉన్న గడుల వల్ల ల్యాప్​టాప్ కూలింగ్  ‌‌ ‌‌ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. 

ధర: క్వాలిటీని బట్టి 500 రూపాయల నుంచి మొదలు

కూలింగ్ ప్యాడ్

ల్యాప్​టాప్​ ఎక్కువగా వాడేవాళ్లు కూలింగ్ ప్యాడ్ కచ్చితంగా వాడాలి. ఎందుకంటే.. పీసీలకు ఉన్నట్టు ల్యాప్​టాప్​లకు పెద్ద కూలింగ్ ఫ్యాన్లు ఉండవు. కాబట్టి తొందరగా వేడెక్కుతుంది. ఎక్కువగా వాడే ల్యాప్​టాప్​ల టెంపరేచర్​ని తగ్గించాలంటే ఇన్​బిల్ట్​గా వచ్చే ఫ్యాన్ల కెపాసిటీ సరిపోదు. దాంతో ల్యాప్​టాప్​లు తొందరగా పాడవుతాయి. అందుకే ఈ ఎక్స్ ‌‌ట్రా కూలింగ్ ప్యాడ్​ని వాడాలి. ఈ ప్యాడ్​లు మార్కెట్​లో రకరకాల వేరియెంట్లతో వస్తున్నాయి. రెండు, నాలుగు, ఐదు, ఆరు ఫ్యాన్లతో తయారుచేస్తున్నారు. ల్యాప్​టాప్ వాడకాన్ని బట్టి వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వాడేవాళ్లు ఎక్కువ ఫ్యాన్లు ఉండే వాటిని వాడాలి. 

ధర: క్వాలిటీని బట్టి 900 రూపాయల నుంచి మొదలు

డాకింగ్ స్టేషన్ ‌‌ ‌‌

కొందరు ల్యాప్​టాప్​లను వర్క్ స్టేషన్, గేమింగ్ సెటప్ కోసం వాడుతుంటారు. అలాంటప్పుడు వాటికి రకరకాల గాడ్జెట్స్ కనెక్ట్ ‌‌ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నార్మల్ యూజర్స్ కూడా చాలా గాడ్జెట్స్ కనెక్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ల్యాప్​టాక్​కు ఉండే యూ ఎస్​‌‌బీ పోర్ట్స్ సరిపోవు. సరిపోయినా.. ఎక్కువగా వాడడం వల్ల తొందరగా పాడవుతాయి. కాబట్టి అలాంటివాళ్లు కచ్చితంగా డాకింగ్ ‌‌ స్టేషన్స్​‌‌ని వాడాలి. మార్కెట్​లో చాలా కంపెనీలు రకరకాల డిజైన్లతో వీటిని తీసుకొచ్చాయి. థండర్​ బోల్ట్ లాంటి ప్రీమియం డాకింగ్ స్టేషన్లు 14 పోర్టులతో వస్తున్నాయి. డాకింగ్ ‌‌ స్టేషన్​ని కొనేటప్పుడు యూఎస్ ‌‌ ‌‌బీ పోర్ట్ ‌‌ ‌‌తో పాటు డిస్ ‌‌ ‌‌ప్లేపోర్ట్​లు, ఎస్​డీ కార్డ్ రీడర్, ఆడియో ఇన్/అవుట్ పోర్ట్, ఈథర్​‌‌నెట్, టైప్-–సీ లాంటి అవసరమైన పోర్టులన్నీ ఉండేట్టు చూసుకోవాలి. 

ధర: క్వాలిటీ, స్పెసిఫికేషన్స్ ‌‌ ‌‌ని బట్టి 500 రూపాయల నుంచి మొదలు

పవర్ బ్యాంక్ ‌‌

ల్యాప్​టాప్​లో బ్యాటరీ ఉన్నా.. కొన్నిసార్లు పవర్ బ్యాంక్ ‌‌ కూడా అవసరమే. ఎందుకంటే.. ఔట్ ‌‌ ‌‌డోర్​లో వర్క్ చేస్తున్నప్పుడు, ట్రావెలింగ్​లో ల్యాప్‌టాప్‌ వాడాల్సి వచ్చినప్పుడు ఈ పవర్ బ్యాంక్​లు బాగా యూజ్ ‌‌ అవుతాయి. ఇప్పుడు చాలా కంపెనీలు ల్యాప్​టాప్​ల కోసం పవర్ ‌‌ బ్యాంక్​లను అందుబాటులోకి తెచ్చాయి. కొన్ని కంపెనీల పవర్ ‌‌ బ్యాంక్​లకు మూడు.. నాలుగు పోర్ట్స్ ‌‌ ఉంటున్నాయి. అవి ల్యాప్​టాప్​తోపాటు ఇంటర్నెట్ ‌‌ రూటర్ ‌‌, మొబైల్స్​ని కూడా ఛార్జ్ ‌‌ చేయగలవు. 

ధర: బ్యాటరీ కెపాసిటీ, క్వాలిటీని బట్టి 3,000 రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయి