టాలీవుడ్, బాలీవుడ్కు తేడా అదే .. ‘ఏజెంట్‌‌’ విలన్ సంచలన కామెంట్స్

టాలీవుడ్, బాలీవుడ్కు తేడా అదే .. ‘ఏజెంట్‌‌’ విలన్ సంచలన  కామెంట్స్

అక్కినేని అఖిల్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్  సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘ఏజెంట్‌‌’ చిత్రంలో బాలీవుడ్ నటుడు డినో మోరియా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీపై డినో మోరియా సంచలన కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

ఇంతకీ అతను ఏం అన్నాడంటే.. స్టోరీ వినగానే తెలుగులో ఎంట్రీకి ఇదే బెస్ట్ స్క్రిప్ట్ అనిపించిందని తెలిపాడు.  ముగ్గురు ఏజెంట్స్ మధ్య క్యాట్ అండ్ మౌస్ చేజ్ ఇదని,ఇందులో  ‘గాడ్‌‌’ అనే  ఏజెంట్‌‌గా నటించానని,  తనకు జరిగిన ద్రోహం కారణంగా వ్యవస్థపై పగ తీర్చుకునే నెగెటివ్ రోల్ అని తెలిపాడు.  

ఇక తెలుగు ఆడియన్స్ తమ స్టార్స్‌ కోసం ప్రాణమిస్తారన్న డినో మోరియా .. ఏ హీరో ఫ్యాన్స్ అయిన మిగతా హీరోలా సినిమాలని ఇష్టపడతారు, ప్రేమిస్తారని చెప్పాడు.  కానీ.. బాలీవుడ్‌లో ఇది అంతగా కనిపించదని అన్నాడు. నెపోటిజం కూడా మాట్లాడిన డినో మోరియా.. తనది  బెంగళూరు అని,  బాలీవుడ్‌లోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ముంబై వెళ్లి వరుస అవకాశాలు సంపాదించుకున్నానని తెలిపాడు. ఇప్పుడు నటుడిగా మంచి స్థాయిలో ఉన్నానని, అందుకే సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఉందంటే తాను అస్సలు నమ్మనన్నాడు.  

ఇక హీరో అఖిల్ గురించి కూడా డినో మోరియా మాట్లాడారు.  హీరో రామ్ చరణ్ తనకు స్నేహితుడని చెప్పిన   డినో మోరియా.. అతడి ద్వారా ఓసారి అఖిల్ ను కలిశానని తెలిపాడు. అప్పటికి చాలా చిన్న కుర్రాడిలా కనిపించిన అఖిల్... ఏజెంట్ షూటింగ్ లో అఖిల్ ను చూసి షాక్ అయ్యానని తెలిపారు.  అప్పట్లో తాను చూసిన అఖిల్, ఇప్పుడు తాను చూస్తున్న అఖిల్ ఒకటేనా అని ఆశ్చర్యం కలిగిందని తెలిపాడు.