మానవత్వం చాటుకున్న పవన్ అభిమానులు

మానవత్వం చాటుకున్న పవన్ అభిమానులు

అశ్వారావుపేట పట్టణంలోని పాత ఆంధ్ర బ్యాంకు రోడ్డులోని కట్టా రామదాసు గారి వీధిలో వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందింది. అదే ఇంట్లో  పాజిటివ్ కేసు ఉండటంతో ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. చుట్టుపక్కల వారు చూసేందుకు కూడా సాహసం చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న అశ్వరావుపేట పవన్ కళ్యాణ్ సేవా సమితి సభ్యులు.. పీపీఈ కిట్లు ధరించి దహనసంస్కారాలు చేసేందుకు ముందుకు వచ్చారు. వారికి రెవిన్యూ సిబ్బంది సహకరించి వృద్ధురాలికి పంచనామా నిర్వహించారు.