శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్

శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్

పోర్న్ ఫిలిమ్స్ కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోర్న్ సినిమాలను తీసి... వాటిని కొన్ని యాప్స్ ద్వారా వాటిని రిలీజ్ చేస్తున్నట్టు రాజ్ కుంద్రాపై ఫిబ్రవరిలోనే కేసు నమోదు చేశారు. ఈ ఇష్యూలో అతనే కీలక పాత్రధారిగా ఉన్నట్టు గుర్తించామని... పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించి కీలక ఆధారాలు ఉన్నాయని, ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా రాజ్  కుంద్రా భావిస్తున్నామని ముంబయి పోలీస్  కమిషనర్  తెలిపారు. ముంబయి పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ పోలీసుల ముందు నిన్న సాయంత్రం రాజ్ కుంద్రా హాజరు కాగా... అక్కడే అతడిని అరెస్ట్ చేశారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని రాజ్ కుంద్రా చెప్పారు. రాజ్ కుంద్రాకు JJ హాస్పిటల్ లో మెడికల్ టెస్టులు చేయించారు పోలీసులు. 2013లో సంచలనం సృష్టించిన IPL బెట్టింగ్ , స్పాట్  ఫిక్సింగ్  కేసులోనూ రాజ్ కుంద్రా నిందితుడిగా ఉన్నారు.