అక్క దారిలోనే చెల్లి

అక్క దారిలోనే చెల్లి

అక్కలు హీరోయిన్లుగా వెలుగుతుంటే, వారిని చూసి చెల్లెళ్లు కూడా కెమెరా ముందుకు రావడం కామన్. ఒకప్పటి షావుకారు జానకి, కృష్ణకుమారి దగ్గర్నుంచి  కాజల్‌‌ అగర్వాల్, నిషాల వరకు అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు మరో హీరోయిన్ చెల్లెలు నటిగా ఎంట్రీ ఇస్తోంది. తనే సాయిపల్లవి చెల్లి పూజ. కోలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌‌‌‌ సిల్వ  డైరెక్టర్‌‌‌‌గా మారి ‘చితిరై సెవ్వానం’ అనే మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాతోనే పూజ పరిచయమవుతోంది. తండ్రీకూతుళ్ల చుట్టూ తిరిగే కథ ఇది. తండ్రిగా సముద్రఖని, ఆయన ముద్దుల కూతురిగా పూజ కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న జీ5లో విడుదల చేయనున్నట్టు రీసెంట్‌‌గా ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌ వైరల్​ కావడంతో.. అచ్చం సాయిపల్లవిని చూస్తున్నట్టే ఉంది అంటున్నారు నెటిజన్స్. అమృత స్టూడియోస్ సంస్థతో కలిసి దర్శకుడు ఏఎల్ విజయ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సామ్ సీఎస్ సంగీతం అందించాడు.