త్వరలో పెళ్లి పీఠలెక్కబోతున్న విద్యుల్లేఖ రామన్

త్వరలో పెళ్లి పీఠలెక్కబోతున్న విద్యుల్లేఖ రామన్

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో తన కామోడీ టైమింగ్ తో  ఆకట్టుకున్న నటి విద్యుల్లేఖ రామన్ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. సంజయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని విద్యుల్లేఖ రామన్ తన ఇన్ స్ట్రాగ్రమ్ లో తెలిపింది. ఆగస్టు 26న తాము రోకా వేడుక చేసుకున్నామని చెప్పింది.అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు,సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగిందన్నారు.తాము మాస్కులు వేసుకుని ఫోటోల కోసం వాటిని తీసేసి మళ్లీ వేసుకున్నామని చెప్పింది.

తమకు విషెస్ చెప్పిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు.  కంగ్రాట్స్ అక్కా అంటూ విద్యుల్లేఖ రామన్ కు వరుణ్ తేజ్ విషెస్ చెప్పారు. ఇంకా ధన్యబాలకృష్ణన్, రాశీఖన్నా ,పాయల్ రాజ్ పూత్,నభానటేష్ విషెస్ చెప్పారు. బొద్దుగా ఉన్న విద్యుల్లేఖ రామన్ ఇటీవల వర్కవుట్స్ తో బరువు తగ్గింది. తన  ఫిట్ నెస్ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి అభిమానులతో పంచుకుంది. .

ఆమోదానికి చేరువలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్

భారత్ లో 65 వేలు దాటిన కరోనా మరణాలు