హార్మూజ్ తెరవడంతో.. పెరిగిన బంగారం, వెండి ధరలు

హార్మూజ్ తెరవడంతో.. పెరిగిన బంగారం, వెండి ధరలు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌‌‌‌‌‌‌‌ ఇరాన్‌‌‌‌‌‌‌‌తో రెండు వారాల సీజ్‌‌‌‌‌‌‌‌ఫైర్​కు అంగీకరించడంతో  బంగారం, వెండి ధరలు బుధవారం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం 2శాతం లాభపడి  ఔన్స్‌‌‌‌‌‌‌‌ (28 గ్రాములు) కి 4,800 డాలర్లు  దాటగా, వెండి 4శాతం పెరిగి ఔన్స్‌‌‌‌‌‌‌‌కి 76 డాలర్లకు చేరింది.  హార్మూజ్‌‌‌‌‌‌‌‌ జల సంధి ఓపెన్ కావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగైంది. భారత మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌ (ఎంసీఎక్స్‌‌‌‌‌‌‌‌)లో బంగారం ఫ్యూచర్స్‌‌‌‌‌‌‌‌ (జూన్‌‌‌‌‌‌‌‌) 2శాతం పెరిగి 10 గ్రాములకు  రూ.1,53,389  వద్ద , వెండి ఫ్యూచర్స్ (మే) 5శాతం పెరిగి కేజీకి రూ.2,43,573  వద్ద ట్రేడ్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి.   

అయితే,  జనవరి గరిష్ట స్థాయిలతో పోలిస్తే బంగారం 25శాతం, వెండి 37శాతం తక్కువకు ట్రేడవుతున్నాయి. ఇది తాత్కాలిక ర్యాలీ మాత్రమేనని, బంగారానికి  4,930–5,000 డాలర్ల వద్ద,  వెండికి  80–81 డాలర్ల వద్ద  రెసిస్టెన్స్ ఉందని అన్నారు. గుడ్‌‌‌‌‌‌‌‌ రిటర్న్స్‌‌‌‌‌‌‌‌ ప్రకారం, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ స్పాట్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో  10 గ్రాముల బంగారం ధర 3,980 పెరిగి 1,53,820 కి, కేజీ  వెండి ధర రూ.10 వేలు  పెరిగి రూ.2,65,000 కి చేరాయి.