AI రంగంలో అదానీ గ్రూప్ సంచలనం: 8 లక్షల కోట్ల భారీ పెట్టుబడి!

AI రంగంలో అదానీ గ్రూప్ సంచలనం: 8 లక్షల కోట్ల భారీ పెట్టుబడి!

గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోసం ఏకంగా 100 బిలియన్ డాలర్ల అంటే సుమారు రూ. 8.3 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. 2035 నాటికి ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలని సంస్థ భావిస్తోంది. అయితే ఈ AI డేటా సెంటర్లు అన్నీ కూడా పునరుత్పాదక శక్తితోనే నడుస్తాయి. అంటే పర్యావరణానికి హాని కలగకుండా గ్రీన్ ఎనర్జీని వాడతారు.

అదానీ గ్రూప్ పెట్టే ఈ పెట్టుబడి వల్ల ఇతర అనుబంధ రంగాల్లో మరో $150 బిలియన్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే మన దేశంలో AI కోసం $250 బిలియన్ల భారీ వ్యవస్థ ఏర్పడుతుంది. ప్రస్తుతం ఉన్న 2 గిగావాట్ల సామర్థ్యాన్ని 5 గిగావాట్లకు పెంచాలని అదానీ లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఏ నగరాల్లో ఏర్పాటు చేస్తున్నారంటే :
*విశాఖపట్నంలో  దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌తో కలిసి హైదరాబాద్ & పూణేలో డేటా సెంటర్లను నిర్మిస్తున్నారు. గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని నోయిడాలో కూడా పనులు మొదలుపెట్టారు. డిజిటల్ వ్యాపారం ఇంకా AI అవసరాల కోసం ఫ్లిప్‌కార్ట్ కూడా అదానీతో భాగస్వామ్యాన్ని మరింత పెంచుకుంటోంది.