హెలికాప్టర్ల తయారీకి లియోనార్డోతో అదానీ జట్టు

హెలికాప్టర్ల తయారీకి లియోనార్డోతో అదానీ జట్టు

ఢిల్లీ:  భారత్‌‌లో పూర్తిస్థాయి హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అదానీ డిఫెన్స్  ఏరోస్పేస్ ఇటలీకి చెందిన లియోనార్డో సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది.   వచ్చే పదేళ్లలో భారత సాయుధ దళాలకు అవసరమయ్యే వెయ్యికి పైగా హెలికాప్టర్లను అందించడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. ఏడబ్ల్యూ169ఎం, ఏడబ్ల్యూ109 ట్రెక్కర్ ఎం వంటి అత్యాధునిక మోడళ్ల తయారీ నుంచి పైలట్ శిక్షణ వరకు అన్ని సౌకర్యాలను ఇక్కడే కల్పిస్తారు. 

స్వదేశీ రక్షణ ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి ఈ ఒప్పందం బలాన్ని చేకూరుస్తుంది. దీనిపై అదానీ డిఫెన్స్  ఏరోస్పేస్ సీఈఓ ఆశిష్ రాజవంశీ ఈ భాగస్వామ్యం సైనిక అవసరాలను తీర్చడంలో కీలకమని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం హెలికాప్టర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో ఏటా వంద హెలికాప్టర్ల తయారీ అవసరమని అంచనా వేస్తున్నారు.