న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్) తన ఎయిర్‌పోర్టులను చిన్న సిటీలుగా మార్చాలని చూస్తోంది. ఇందుకోసం మూడు కొత్త పుల్లీ ఓన్డ్ సబ్సిడరీలను ఏర్పాటు చేసింది. అదానీ ఎయిర్‌పోర్ట్ సిటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో అదానీ నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ సిటీ లిమిటెడ్, అదానీ గువాహటి ఎయిర్‌పోర్ట్ సిటీ లిమిటెడ్, అదానీ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ సిటీ లిమిటెడ్‌లు నడుస్తాయి.
ఈ కొత్త సంస్థలు ఎయిర్‌పోర్డ్ ఏరియాలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు, భవన నిర్మాణం, అలాగే రెస్టారెంట్లు, బ్యాంక్వెట్లు, బిజినెస్ సెంటర్లతో కూడిన హోటళ్ల నిర్మాణం వంటివి చేపడతాయి. ప్రతి సంస్థ రూ.10 లక్షల పెయిడప్ క్యాపిటల్‌తో ఏర్పాటయింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ సబ్సిడరీ అయిన అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ 2019లో ఏర్పాటయ్యింది.
దీని సబ్సిడరీ అదానీ ఎయిర్‌పోర్ట్ సిటీ లిమిటెడ్. అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ ప్రస్తుతం దేశంలో ఎనిమిది విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. ఇవి దేశీయ ప్రయాణికులలో 25శాతం ఫుట్‌ఫాల్స్, 33శాతం ఎయిర్ కార్గో ట్రాఫిక్‌ను కలిగి ఉన్నాయి.

