అదానీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌మిషన్ లిమిటెడ్ లాభం రూ.478 కోట్లు

అదానీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌మిషన్ లిమిటెడ్  లాభం రూ.478 కోట్లు

 మొత్తం ఆదాయం రూ.3,037 కోట్లు

న్యూఢిల్లీ: అదానీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌మిషన్ లిమిటెడ్ (ఏటీఎల్​) కు  2022 డిసెంబర్​తో ముగిసిన మూడో క్వార్టర్​లో  నికర లాభం దాదాపు 73 శాతం జంప్ చేసి రూ. 478 కోట్లకు చేరుకుంది. - వన్- టైమ్ ఇన్​కమ్​ రావడం, ఆదాయాలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది. అయితే,  డిసెంబర్ 31, 2022తో ముగిసిన క్వార్టర్​లో కంపెనీ  నికర లాభం రూ.277 కోట్లు. 2022–-23 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్​లో ఆదాయం (కన్సాలిడేటెడ్​) రూ. 2,623 కోట్ల నుంచి రూ. 3,037 కోట్లకు పెరిగింది. ప్రాఫిట్​ ఆఫ్టర్​ ట్యాక్స్​ (పీఏటీ) 73 శాతం పెరిగింది.  రెగ్యులేటరీ ఆర్డర్ నుండి రూ. 240 కోట్ల వన్​ టైమ్​ఇన్​కమ్ ​వచ్చిందని కంపెనీ ప్రకటనలో పేర్కొంది. ఈ విషయమై అదానీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌మిషన్ ఎండీ అనిల్ సర్దానా మాట్లాడుతూ, ‘‘స్థూల ఆర్థిక వాతావరణంలో సవాళ్లు ఉన్నప్పటికీ కంపెనీ​ వృద్ధి  బాగుంది. మా ప్రాజెక్టులు చాలా రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. ఫలితంగా మా వ్యాపారం మరింత పెరుగుతుంది. భారతదేశంలో అతిపెద్ద  ప్రైవేట్ రంగ పవర్​ ట్రాన్స్​మిషన్‌‌గా​ మా స్థానం మరింత సుస్థిరం అవుతుంది”అని ఆయన పేర్కొన్నారు. అదానీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌మిషన్ దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌మిషన్ కంపెనీ. భారతదేశంలోని 13 రాష్ట్రాల్లో 18,795 సర్క్యూట్ కిలోమీటర్ల ట్రాన్స్‌‌‌‌‌‌‌‌మిషన్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను కలిగి ఉంది. మరో 3,424 సర్క్యూట్ కిలోమీటర్ల నెట్​వర్క్​ నిర్మాణం వివిధ దశల్లో ఉంది.  ఇదిలా ఉంటే, బీఎస్ఈలో ఏటీఎల్ షేర్లు సోమవారం 10 శాతం తగ్గి రూ.1,261.40 వద్ద ముగిశాయి.

 రూ. 9 వేల కోట్ల అప్పు తీరుస్తాం: అదానీ

2024 సెప్టెంబర్ లో మెచ్యూరిటీ గడువు ఉన్న తనఖా షేర్లను విడిపించుకోవడానికి  ప్రమోటర్లు 1.1 బిలియన్  డాలర్లను (దాదాపు రూ.9 వేల కోట్లు) ముందస్తుగా చెల్లిస్తారని అదానీ గ్రూప్ సోమవారం తెలిపింది. ఈ షేర్లు అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ,  అదానీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌మిషన్​కు చెందినవని పేర్కొంది. అన్ని షేర్ -బ్యాక్డ్ ఫైనాన్సింగ్‌‌‌‌‌‌‌‌లను ముందుగా చెల్లించాలనే ప్రమోటర్ల హామీకి కొనసాగింపు ఇదని స్పష్టం చేసింది. అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌  స్టాక్ మానిప్యులేషన్, మనీలాండరింగ్​ చేసిందంటూ హిండెన్​బర్గ్ ​ఆరోపించిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది.  ప్రమోటర్ హోల్డింగ్‌‌‌‌‌‌‌‌ 12 శాతం ఉన్న అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్‌‌‌‌‌‌‌‌ల 168.27 మిలియన్ షేర్లు  ముందస్తు చెల్లింపు వల్ల విడుదల అవుతాయి. అదానీ గ్రీన్ విషయానికొస్తే ప్రమోటర్ హోల్డింగ్‌‌‌‌‌‌‌‌లో 3 శాతం ఉన్న 27.56 మిలియన్ షేర్లు తిరిగి సంస్థకు దక్కుతాయి. ప్రమోటర్ హోల్డింగ్‌‌‌‌‌‌‌‌లో 1.4 శాతం ఉన్న అదానీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌మిషన్‌‌‌‌‌‌‌‌లోని 11.77 మిలియన్ షేర్లు కూడా విముక్తి పొందుతాయి