అరివళగన్ కాంబినేషన్‌‌లో ఆది పినిశెట్టి సినిమా

అరివళగన్ కాంబినేషన్‌‌లో ఆది పినిశెట్టి సినిమా

హీరోగానే కాక విలన్‌‌గానూ మెప్పిస్తూ ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. నిన్న అతని పుట్టినరోజు. ఈ సందర్భంగా కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘శబ్ధం’ అనే టైటిల్‌‌ను ఫిక్స్ చేశారు. సెవెన్ జీ ఫిలిమ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. 

అరివళగన్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఆది, అరివళగన్ కాంబినేషన్‌‌లో ‘వైశాలి’ అనే హారర్ థ్రిల్లర్ వచ్చి సూపర్ సక్సెస్ సాధించింది. పదమూడేళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది. ఈసారి కూడా హారర్ మూవీనే చేస్తున్నారు. తమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ ఏడాది గుడ్ లక్ సఖి, క్లాప్, వారియర్ చిత్రాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన ఆది.. మరోవైపు తమిళంలో ‘పార్ట్‌‌నర్‌‌‌‌’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.