ప్రజల్లో నమ్మకం పెరిగేలా విధులు నిర్వహించాలి: ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్మహాజన్

ప్రజల్లో నమ్మకం పెరిగేలా విధులు నిర్వహించాలి: ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్మహాజన్

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: పోలీసుల పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగేలా అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్​మహాజన్​ సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించగా జిల్లాలో ఆయా మండలాల నుంచి 28 మంది బాధితులు వచ్చి ఎస్పీకి ఫిర్యాదులు అందజేశారు. సమస్యలు పరిష్కరించాలని ఫోన్ ద్వారా సంబంధిత పోలీసు సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. 

పోలీసులు బాధితుల పక్షాన ఉంటూ వారి సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత పాల్గొన్నారు.