సిద్ధార్థ్‌, అదితీ స్టెప్పులు.... వీడియో వైరల్

సిద్ధార్థ్‌, అదితీ స్టెప్పులు.... వీడియో వైరల్

హీరో సిద్ధార్థ్,  హీరోయిన్ అదితీరావు హైదరి  ప్రేమలో ఉన్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ మహాసముద్రం అనే మూవీలో కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని వార్తలు షికారు చేశాయి. ఎన్ని వార్తలు వస్తున్నా..వీరిద్దరు మాత్రం ఖండించడం లేదు. పైగా ఫంక్షన్లు, టూర్లకు తిరుగుతూ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నారు.  ఈ క్రమంలో తాజాగా సిద్ధార్థ్ తో కలిసి అదితీరావు డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఓ ట్రెండింగ్ సాంగ్కు  సిద్ధార్థ్‌తో కలిసి  అదితీ డ్యాన్స్‌ చేసింది.  సాంగ్‌లో  ఇద్దరు ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేశారు. ఆ తర్వాత అదితీ ఈ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. ఇప్పటికే ఈ వీడియోకు సుమారు 3.5 లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం. 


అదితి- సిద్ధార్థ్‌ త్వరలోనే వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక  సిద్ధార్థ గతంలో పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాడు. అదితీరావు హైదరి కూడా గతంలోనే వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది.