సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీలో అడ్మిషన్లు షురూ

సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీలో అడ్మిషన్లు షురూ

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ ఏరియా సీసీసీ నస్పూర్​లోని సింగరేణి పాలిటెక్నిక్​ కాలేజీలో ఆదివారం నుంచి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సింగరేణి ఉద్యోగుల పిల్లల ప్రత్యేక కోటా కింద150 సీట్లను కేటాయించి, అడ్మిషన్లు స్వీకరిస్తున్నారు. 

సివిల్​ ఇంజనీరింగ్, కంప్యూటర్​ సైన్స్, ఎలక్ట్రికల్​అండ్​ ఎలక్ట్రానిక్​ ఇంజనీరింగ్, మెకానికల్, మైనింగ్​ విభాగాల్లో 30 సీట్ల చొప్పున సీట్లు పొందేందుకు సింగరేణి ఉద్యోగుల పిల్లలు అర్హులని కాలేజీ ప్రిన్సిపాల్  నీల్​కుమార్​ తెలిపారు. 

జూన్​ 8 లోగా ఆన్​లైన్​లో https://scp.scpolytechnic.com/counseling/ వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి సమాచారం కోసం 8790112515, 9908151618, 9010222161 నంబర్లలో సంప్రదించాలని కోరారు.