టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్.. మూడు మార్పులతో బరిలోకి టీమిండియా!

టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్.. మూడు మార్పులతో బరిలోకి టీమిండియా!

IND vs AFG: లక్నోలోని ఎకానా స్టేడియంలో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు టాస్ పడింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది మొదటగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. గత మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఆఫ్ఘన్ రంగంలోకి దిగుతుండగా.. ఈ పోరులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని గిల్ సేన చూస్తుంది

ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ షాహిది మాట్లాడుతూ.. తమ జట్టులో కూడా మూడు ముఖ్యమైన మార్పులు జరిగినట్లు కన్ఫర్మ్ చేశాడు. స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ అనారోగ్యం (Sick) కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ గాయపడ్డాడు. అలాగే జియా ఉర్ రెహ్మాన్ షరీఫీ కూడా ఈ మ్యాచ్ ఆడటం లేదు.. వీరి ప్లేస్‌లో బిలాల్ సామి, దర్విష్ రసూలిలతో పాటు మరో ప్లేయర్ జట్టులోకి వచ్చారని వెల్లడించాడు. 

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే మేము కూడా మొదట బౌలింగే తీసుకునే వాళ్లం.. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగడం, తద్వారా అనుభవాన్ని సంపాదించడమే మాకు ముఖ్యం.. ఈ మ్యాచ్ కోసం మేము జట్టులో మూడు మార్పులు చేశాం.. ప్రిన్స్ యాదవ్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం (Debut) చేస్తున్నాడు. అలాగే జట్టులోకి కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్ తిరిగి వచ్చారని కెప్టెన్ గిల్ తెలిపాడు.

ఇరు జట్లు:
ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), దర్విష్ రసూలీ, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటీ, AM ఘజన్‌ఫర్, మహ్మద్ సలీమ్ సమీ, బిలాలాలి

భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్