కోటపల్లి,వెలుగు : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బొప్పారం గ్రామ ప్రజల 12 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. గ్రామానికి బస్సు సౌకర్యం అందుబాటులోకి రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ సర్పంచ్ జెల్ల సమ్మక్క బుధవారం తొలిసారిగా గ్రామానికి వచ్చిన బస్సుకు ఘన స్వాగతం పలికారు.
2014 నుంచి బస్సు సౌకర్యం లేక ప్రజలు ఆటోలపై ఆధారపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని బస్సు సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు.
దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ ప్రసాద్ తివారి, నాగంపేట సర్పంచ్ విశాల్ ప్రసాద్ తివారి, కాంగ్రెస్ నాయకులు
పాల్గొన్నారు.
