విద్యాబుద్దులు చెప్పే స్కూల్లో ఈ పనేంట్రా..వైరల్ అవుతున్న న్యూఇయర్ ప్రోగ్రాం

విద్యాబుద్దులు చెప్పే స్కూల్లో ఈ పనేంట్రా..వైరల్ అవుతున్న న్యూఇయర్ ప్రోగ్రాం

స్కూళ్లో న్యూఇయర్ వేడుకలు వివాదాస్పదం అయ్యాయి.. జనవరి 1న స్కూళ్లో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద దుమారం రేగింది. పిల్లలకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ప్రదేశంలో ఇలాంటి  చెత్త ప్రోగ్రాంలేంటీ అంటూ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక విషయం తెలిసిన అధికారులు  ప్రోగ్రాం నిర్వాహకులపై చర్యలు సిద్దమయ్యారు. 

జనవరి 1న్యూఇయర్ వేడుకల సందర్భంగా మధ్యప్రదేశ్ లోని  ఓ ప్రభుత్వ స్కూల్ లో జరిగిన ఈవెంట్స్ వీడియోలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. వీడియోలో స్కూల్ ఆవరణలో డ్యాన్సర్లు రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్న దృశ్యాలు కనిపించారు. డ్యాన్సర్లు మ్యూజిక్ కు రిథమిక్ గా కదులుతుండగా.. చూసే ఊరిజనం వారిపై డబ్బులు జల్లుతూ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల ఆగ్రహానికి గురి చేసింది. 

స్థానిక మీడియా ప్రకారం.. ఎంపీలోని  దతియా జిల్లా పరసారిలోని ప్రభుత్వ స్కూల్ లో ఈఘటన జరిగింది. ప్రోగ్రాం స్కూల్  అయిపోయాక జరిగిందని.. స్కూల్ ఆవరణలో ఊరిజనంకోసం  రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాంకు సంబంధించిన వీడియో ఆన్ లైన్ లో వైరల్ కావడంతో అటు విద్యాశాఖ, ఇటు స్థానిక అధికారుల్లో తుఫాను సృష్టించింది. విద్యాబుద్దులు, క్రమశిక్షణ నేర్పాల్సిన స్కూల్ లో ఇలాంటి కార్యక్రమాలకు ఎలా అనుమతిచ్చారంటూ అనేక ప్రశ్నలు తలెత్తాయి. 

ఇక ఈ  ఘటనపై జిల్లా  ఉన్నతాధికారులు సీరియస్ గానే స్పందించారు. ఈ వీడియో జిల్లా విద్యాధికారి దృష్టికి వెళ్లడంతో వివరణ ఇవ్వాలని స్కూల్ ప్రిన్సిపాల్ కు నోటీసుచ్చారు. నోటీసులపై స్పందించిన ప్రిన్సిపాల్ .. స్కూల్  టైం అయిపోన తర్వాతే స్కూల్ ఆవరణలో ఈ ప్రోగ్రాం నిర్వహించారు.. అంతా గ్రామ పంచాయత్ సెక్రటరీ,  సర్పంచ్ అనుమతితోనే  ప్రోగ్రాం నిర్వహించారని, తనకు ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని  వివరణ ఇచ్చింది. 

ఈ ప్రోగ్రాం కు ఎవరు పర్మిషన్ ఇచ్చారు. నిబంధనలు ఎలా ఉల్లంఘించారనే దానిపై ప్రస్తుతం విచారణ సాగుతోంది. ఈ ఘటన విద్యాసంస్థల దుర్వినియోగం, అధికారుల జవాబుదారి తనంపై చర్చకు దారి తీసింది.